సమాజంలో మనిషి తన మనుగడ కొనసాగించాలంటే డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు జీవనం భారంగా మారింది. అందువల్ల జీవితంలో ఇలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు.
ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కూడా ఒకటి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగస్తులకు ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇది మొదట్లో ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి మాత్రమే వర్తించేది. కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అందుబాటులోకి వచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ.500 ప్రారంభ పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ స్కీం లో రెండు రకాల ఖాతాలుంటాయి ఒకటి టైర్ 1 మరొకటి టైర్ 2 ఈ రెండింటిలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టవచ్చు.
ఉదాహరణకు ఈ పథకంలో నెలకు రూ.3000 చొప్పున ప్రతినెల పొదుపు చేస్తూ ఉండాలి. ఇలా మీకు 60 సంవత్సరాలు వయసు దాటే వరకు ఇలా పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ మీరు 18 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెడితే 44 లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు. అలా కాకుండా 34 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు దాదాపు 26 సంవత్సరాల పాటు ఈ పథకంలో ప్రతి నెల 3000 రూపాయలు పెట్టుబడి పెడితే దీని మెచ్యూరిటీపై రూ.44.35 లక్షలు పొందుతారు. ఇలా ప్రతి నెల రూ. 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత రూ.44 లక్షలు పొందవచ్చు.