పెట్రోల్ పంప్ బిజినెస్ మొదలెట్టాలని అనుకుంటున్నారా.. ఎంత లాభం వస్తుందంటే?

మన దేశంలో అదిరిపోయే లాభాలను అందించే వ్యాపారాలలో పెట్రోల్ పంప్ బిజినెస్ కూడా ఒకటని చెప్పవచ్చు. కనీసం పదో తరగతి పాసైన వాళ్లు పెట్రోల్ పంప్ బిజినెస్ ను మొదలుపెట్టవచ్చు. 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు సులువుగా ఈ బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తులు మాత్రమే ఈ బిజినెస్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కనీసం మూడేళ్ల పాటు ఏదైనా బిజినెస్ ను నిర్వహించిన అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ వ్యాపారం నిర్వహించడానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తి ఉన్నవాళ్లు ఈ బిజినెస్ ను నిర్వహించడానికి అర్హత కలిగి ఉంటారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

లీటర్ పెట్రోల్, డీజిల్ పై వేర్వేరుగా 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు లాభం పొందవచ్చు. ఎక్కువ మొత్తం పెట్రోల్ ను విక్రయిస్తే ఎక్కువ మొత్తం లాభం పొందే అవకాశం ఉంటుంది. కమీషన్ ఆధారంగా ఈ వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఎక్కువ సంఖ్యలో జన సంచారం ఉండే ప్రాంతాలలో పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ బిజినెస్ పై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.