మన దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలక ప్రకటన చేశాయి. పెట్రోల్ బంకులకు పెంచే కమిషన్ ను పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం డీలర్లకు రూ.1,868.14 ఛార్జీగా 0.875 శాతం కమీషన్ గా లభిస్తోంది. డీజిల్ రవాణా ఛార్జీ రూ.1389.35 గా ఉండగా .28 శాతం కమీషన్‌గా లభిస్తోంది.
పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించాల్సిన డీలర్ కమిషన్‌ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రకటనపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు. రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని చెప్పుకొచ్చారు.
కొన్ని ప్రాంతాలలో జరగనున్న ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఏపీ, తెలంగాణలోని ఏయే ప్రాంతాల్లో ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే మాత్రం ప్రజలకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.