పాకిస్థాన్ నుంచి క్షేమంగా భారత్ కు తిరిగొచ్చిన వింగ్ కమాండర్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్ పరామర్శించారు. ప్రస్తుతం అభినందన్ ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అభినందన్ ఐఏఎఫ్ డ్రెస్ ధరించి ఉండటం విశేషం.
వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కూడా మంత్రి వెంట వచ్చారు. పలు రకాల పరీక్షల కోసం అభినందన్‌ను ఢిల్లీలోని హాస్పిటల్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయమే వర్ధమాన్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలుసుకున్నారు.