KK Survey: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం మహాయుతి కూటమి భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. మొత్తం 288 స్థానాలున్న మరాఠ రాష్ట్రంలో మహాయుతి కూటమి 230 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది.ఇందులో బీజేపీ 132 సీట్లు, శివసేన 57 స్థానాలు, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించాయి. ఇకా కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కేవలం 46 సీట్లకే పరిమితమైంది.
ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కి అనుగుణంగానే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయని తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రతి ఒక్క చోట 100% నిజం కావడం విశేషం. ముఖ్యంగా ఏపీలో కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మొదట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే చివరికి ఈయన చెప్పినదే నిజం కావడంతో దేశవ్యాప్తంగా కేకే సర్వే పేరు మారుమోగుతుంది.
ఇక మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కూడా కేకే సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. మరాఠ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఎలా ప్రచారం చేశాయో కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 వరకు మహారాష్ట్రలో నువ్వా నేనా అనే విధంగా ప్రచార కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
ఇక నవంబర్ ఒకటి నుంచి క్రమక్రమంగా అక్కడ పరిస్థితులు మారుతూ వచ్చాయి.బీజేపీ మంచి ప్లాన్ ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఎక్కడ ఎవరికి బలముంటే వారికి సీటు ఇచ్చినట్లు తెలిపారు. శివసేన బలంగా ఉన్న చోట శివసేనకు.. ఎన్సీపీ బలంగా ఉన్న స్థానంలో ఎన్సీపీకి టికెట్లు ఇచ్చిందని చెప్పారు.అలాగే బీజేపీ బలం ఉన్న చోట ఆ పార్టీ పోటీ చేసినట్లు వివరించారు. కానీ మహా వికాస్ అఘాడి కూటమిలో అలా జరగలేదన్నారు. పలు సీట్లలో ఓ పార్టీకి బలం ఉంటే మరో పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల దెబ్బ పడిందని తెలిపారు. ఇక ప్రచార కార్యక్రమాలలో భాగంగా మహా వికాస్ పూర్తిగా వెనుకబడిందని ఈయన తెలిపారు. ఈ కారణాల వల్లే మహారాష్ట్రలో కూడా కూటమి అధికారంలోకి వచ్చిందని కిరణ్ కొండేటి తెలిపారు.