YS Jagan: అటు తిరిగి ఇటు తిరిగి జగన్ లైన్ లోకే కూటమి ప్రభుత్వం!

YS Jagan: సినిమా టిక్కెట్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో.. సామాన్యులను, చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలపై సగం సగం తెలిసో.. లేక, కావాలనే కక్షతోనో.. అదీగాక, స్వార్ధ ప్రయోజనాలు ఆశించో తెలియదు కానీ.. జగన్ పై చాలా మంది విమర్శలు చేశారు. అయితే.. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా జగన్ నిర్ణయాన్నే సమర్థించే పనికి పూనుకుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సామాన్యుడు థియేటర్ కు వచ్చేలా టిక్కెట్ ధరలు పెంచుతామని కందుల దుర్గేష్ చెప్పిన మాట.. ఒకప్పుడు జగన్ చెప్పిందే కదా..?

సినిమా బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటూ.. సినిమా నష్టపోకుండా టిక్కెట్ ధరలు పెంచుతామని చెప్పిందీ.. జగన్ చెప్పిందే కదా..?

జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ధరల పద్దతే బాగుందని.. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు తనతో అన్నారని బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి చేసిన వ్యాఖ్యలు గట్టిగా తగిలాయా..?

ఎవరు చెప్పారు.. ఎవరు అమలు చేశారు.. అన్నది ముఖ్యం కాదు.. ఎలా అమలు చేశారు.. ఇందులో ప్రజలకు ఉపయోగం ఎంత అనేది కదా ప్రభుత్వాలు చూడాలి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ పుణ్యమాని బడ్జెట్ లు భారీగా పెరిగిపోతున్నాయని.. ఫలితంగా విడుదల సమయంలో టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాల వద్దకు వెళ్తే.. వారు మొహమాటానికో ఏమో కానీ అనుమతులు ఇస్తున్నారని.. ఈ పెరిగిన ధరల కారణంగా సామాన్యులు థియేటర్లకు రావడం లేదని.. దీంతో.. ఓ మోస్తరు నెగిటివ్ టాక్ వస్తే మూడో రోజునే థియేటర్లలో ఫుట్ ఫాల్స్ మొత్తం పడిపోతున్నాయనే చర్చ ఇటీవల విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఓపెనింగ్స్ బాగుంటే చాలు చాలా వరకూ కలెక్ట్ చేసెయ్యొచ్చనే అర్ధ జ్ఞానపు ఆలోచన ప్రభావం వల్ల.. ఎంత గొప్ప సినిమా అని చెప్పుకున్నా, సూపర్ డూపర్ హిట్ అని ప్రకటించుకున్నా.. ప్రొడ్యూసర్ మాత్రం నష్టాలు చూస్తున్నాడనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. సామాన్యులు థియేటర్లకు రాకపోవడమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. టిక్కెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలా చూసుకుంది!

దీనిపై హాల్ఫ్ నాలెడ్జ్ బ్యాచ్ చాలా మంది కుయ్యో మొర్రో అన్నారని.. ఈ రోజుల్లో 50 రూపాయలు ఏమి వస్తుంది.. 10లు 30లు ఎవరైనా గుర్తిస్తున్నారా అంటూ గొణుకున్నారని.. అయితే… టిక్కెట్ ధరలు పెరగడంతో అసలు జనాలు థియేటర్స్ వైపే చూడటం లేదని అంటున్నారు! ఈ సమయంలో… కూటమి ప్రభుత్వం కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల వైపే మొగ్గు చూపి, పేర్లు పదాలు మార్చి, వాటిని అమలు చేయనునందని అంటున్నారు!

తాజాగా తనను కలిసిన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు వ్యక్తులతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా… సామాన్యుడు థియేటర్ కు వచ్చేలా టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని కందుల దుర్గేష్ అన్నారు. ప్రతి సినిమాకు విడివిడిగా జీవోలు ఇచ్చే పద్దతికి స్వస్తి పలికి.. ఒకే విధానంలో టిక్కెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో… జగన్ సర్కార్ చెప్పింది ఇదే కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ప్రధానంగా సామాన్య ప్రేక్షకుడిపై టికెట్‌ ధరల భారం పడకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. సినిమా చిత్రీకరణలో ఎంత శాతం ఏపీలో చేయాలనేదానిపైనా నిబంధనలు నిర్ణయిస్తామన్నారు. ఈ సందర్భంగా స్పందించిన దర్శకుడు తేజ… థియేటర్స్ లో టిక్కెట్ ధరలంటే పాప్ కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. అవి చూస్తే తనకే భయం వేస్తుందని అన్నారు!

వాస్తవానికి ఏపీలో గత ప్రభుత్వంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. సామాన్యులకు సినీ వినోదం భారం కాకూడదని, తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి సీఎం జగన్ తెలిపారు. అయితే దీనిపై సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని జగన్ టార్గెట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు.

ఇక ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వెనుక తంధాన తాన అంటూ హీరో నాని సహా పలువురు సినీ ప్రముఖులు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు!

కట్ చేస్తే.. ఇటీవల థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం.. అధిక టికెట్ రేట్లే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సమయంలో.. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన నిర్మాత బన్నీ వాసు సైతం ఇప్పుడు తన చిత్రాన్ని సరసమైన ధరలతోనే విడుదల చేస్తున్నామని ప్రకటించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు తగ్గిస్తూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భావిస్తున్నారని బీవీఎస్‌ రవి తెలిపారు.

దీంతో… నాడు వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఆయనపై అవాకులు చెవాకులు పేలుతూ.. కాస్తైనా బుర్ర పెట్టి ఆలోచించకుండా.. తమ స్వార్ధ ప్రయోజనాల కోణంలోనే ఆలోచించిన చాలా మంది హాల్ఫ్ నాలెడ్జ్ సెలబ్రెటీలు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారనే చర్చా వినిపిస్తోంది!

సీఎం పవన్ | Analyst Chinta Rajasekahar EXPOSED Pawan Kalyan Politics || Janasena | Nageswaramma |TR