అన్నం తినడానికి డబ్బులు లేక పానీపూరీలు తిన్నా.. సూపర్ స్టార్ కన్నీటి కష్టాలు?

సాధారణంగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయినా లేదా ఒక సినిమా సెలబ్రిటీ అయిన గొప్ప స్థానంలో ఉన్నారంటే ఆ విజయం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ప్రస్తుతం ఈయన 8 పదుల వయసులోకి అడుగుపెట్టిన పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే మరోవైపు కౌన్ భనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈయన ఎన్నో తన వ్యక్తిగత విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే తాజాగా తాను ఇండస్ట్రీకి రాకముందు అనుభవించిన కష్టాల గురించి తెలియజేశారు.ప్రస్తుతం కొన్ని వేలకోట్లకు అధిపతి అయినటువంటి అమితాబ్ ఇండస్ట్రీలోకి రాకముందు కడుపునిండా అన్నం తినడానికి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు ఈయన వెల్లడించారు. అమితాబ్ ఇండస్ట్రీలోకి రాకముందు కలకత్తాలో పనిచేసేవారట.

ఈ విధంగా ఈయన కలకత్తాలో పనిచేసే సమయంలో నెలకు 300 రూపాయల జీతం చెల్లించే వారని అయితే ఈ 300 రూపాయలతో తన అన్ని అవసరాలు తీరేవి కాదని తెలిపారు.ఇలా తనకు తక్కువ జీతం రావడంతో కడుపునిండా అన్నం కూడా తినలేని పరిస్థితి అని ఆకలి వేసినప్పుడు అన్నం కాకుండా పానీపూరీలు తింటూ తన ఆకలి నింపుకున్నానని ఈ సందర్భంగా ఈయన పడినటువంటి కష్టాల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే అమితాబ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.