వైరల్ : మహేష్ సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి తండ్రి.!

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి ఉన్న అనేక భారీ చిత్రాల్లో వాటి అన్నిటిని మించి ఉన్న ఒకే ఒక్క సెన్సేషనల్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా అని చెప్పాలి.

ఇద్దరి కలయికలో మొదటి సినిమా ఇది కాగా మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆల్రెడీ ఇది ఓ గ్లోబల్ లెవెల్ సినిమాగా ఉంటుంది అని కన్ఫర్మ్ చేయగా అడ్వెంచర్ జానర్ లో అయితే ఉంటుంది అని కూడా తెలిసింది. కాగా ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఈ సినిమా కథా రచయితా అలానే రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన అప్డేట్ ఇపుడు సెన్సేషన్ గా మారింది.

కాగా తాను మాట్లాడుతూ ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు ఉంటారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే ఎవరినీ అనుకోలేదు అని కానీ ఎవరైనా ఉండే అవకాశం మాత్రం తప్పకుండా ఉందని తెలిపారు. అంతే కాకుండా అది కేవలం ఒకరా లేక అంతకు మించి ఎక్కువే ఉంటారా అనేది కూడా సస్పెన్స్ గా ఉంచారు.

మొత్తానికి అయితే ఈ సూపర్ అప్డేట్ తో ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్ రిలీజ్ కూడా ఉంటుంది అనేది మాత్రం ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పుకోవాలి. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ అయితే ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేసి 2025 రిలీజ్ కి ప్లానింగ్ లు చేస్తున్నారు.