అజ్ఞాతవాసి బాటలో విదాముయార్చి.. ఏం జరుగుతుందో చూడాలి మరి!

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సినిమా విదామూయార్చి. ఈ సినిమా 2025 జనవరి 10 రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కుంది. కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకున్న ఈ సినిమా 1997లో విడుదలైన బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ మూవీ కి రీమేక్ అని, కాపీరైట్ హక్కులు తీసుకోకుండా విదాముయార్చి సినిమా తీసిందని.

అందుకే ఈ సినిమా తీసిన లైకా సంస్థ 150 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బ్రేక్ డౌన్ మూవీ ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీని డిమాండ్ చేస్తూ నోటీసు ఇచ్చిందని సమాచారం. అయితే అఫీషియల్ గా ఇటు లైకా ప్రొడక్షన్స్ గాని అటు బ్రేక్ డౌన్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ గాని అఫీషియల్ గా ఈ విషయం గురించి అనౌన్స్ చేయలేదు. అప్పట్లో మన తెలుగు సినిమా అజ్ఞాతవాసి కూడా ఇదే సమస్యని ఎదుర్కొంది. 2008లో వచ్చిన లార్గో వించ్ సినిమానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్లు కథ మార్చి ఈ సినిమాతీసినట్లు సమాచారం.

ఈ మేరకు సదరు లార్గో వించ్ డైరెక్టర్ జరోం సల్లే, ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్న టి సిరీస్ రెండూ కూడా హారిక హాసిని సంస్థకి నోటీసులు పంపించింది అనే వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితేఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని థియేటర్లలోకి వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అజిత్ సినిమా కూడా అదే దోవలో ప్రయాణిస్తుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న హీరో కారు బ్రేక్ డౌన్ అవ్వడం.

భార్యని కారులో ఉంచి హీరో మెకానిక్ కోసం వెళ్ళటం, తిరిగి వచ్చేటప్పటికి హీరోయిన్ తప్పిపోవడం, దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి హీరో పూనుకోవటం. ఈ క్రమంలో అనేక సంఘటనలు జరుగుతాయి, ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. ఇది బ్రేక్ డౌన్ మూవీ స్టోరీ. విదాముయార్చి టీజర్ చూస్తే అచ్చం ఇలాగే ఉంటుంది.మరి అనుకున్నట్టుగానే ఈ సినిమా జనవరి 10న విడుదల అవుతుందా తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.