ఇన్సైడ్ టాక్ : “వార్ 2” లో ఎన్టీఆర్ వచ్చేది అప్పుడేనా?

టాలీవుడ్ ప్రైడ్ చిత్రం  ట్రిపుల్ ఆర్(RRR) హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు తర్వాత భారీ చిత్రాలు ఒకొకటి చేస్తున్నారు. ఇక వీటిపై పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి క్రేజ్ ఉండగా ఈ ఇద్దరు హీరోలు కూడా సెన్సేషనల్ లైనప్ ని అయితే రెడీ చేసుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ లైనప్ మరింత ఎగ్జైటింగ్ గా ఉండగా ఇపుడు దర్శకుడు కొరటాల శివతో అయితే తాను “దేవర” అనే మాస్ ఏక్షన్ డ్రామా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వార్ 2” లో కూడా నటించడం అయితే కన్ఫామ్ అయ్యింది.

మరి దీనిని బాలీవుడ్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనుండగా హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ సినిమాలో స్క్రీన్ పంచుకోనున్నాడు. దీనితో ఈ టాక్ కే హైప్ నెక్స్ట్ లెవెల్లో నెలకొనగా ఈ సినిమాలో అయితే ఎన్టీఆర్ ఎప్పుడు నుంచి జాయిన్ కానున్నాడు అనేది తెలుస్తుంది.

కాగా మొదట అయితే ఎన్టీఆర్ దేవర షూటింగ్ ని ఈ ఏడాది నవంబర్ తో అయితే కంప్లీట్ చేసేసేలా ప్లాన్ చేసుకున్నాడట. దీనితో అయితే ఈ ఏడాది నవంబర్ లోనే లేదా డిసెంబర్ లోనే “వార్ 2” లో ఎన్టీఆర్ దిగిపోతాడు అని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలు కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తాడని కూడా తెలుస్తుంది.