ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మరో బిగ్గెస్ట్ సినిమాగా రాబోతున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం “సలార్” అని చెప్పాలి. మాస్ కి గాని వైలెన్స్ కి గాని సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సెన్సేషనల్ హైప్ ఉంది.
పైగా ఈ సినిమా తమ కేజీఎఫ్ యూనివర్స్ తో మిళితమై ఉండే ప్రాజెక్ట్ కావడంతో మరింత హైప్ నెలకొంది. ఇక ఇదిలా ఉండగా అసలు ఈ సినిమా కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ కోసం ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ బయటకి వచ్చింది. గత కేజీఎఫ్ సినిమాల్లో హీరోకి మెయిన్ ఎమోషన్ తన తల్లి తనకి ఇచ్చిన మాట కాగా..
ఇపుడు సలార్ లో కూడా ఇదే తరహా ఎమోషన్ ని హీరోకి నీల్ డిజైన్ చేసాడట. ఐతే ఈ చిత్రంలో ప్రభాస్ కి స్నేహం అనే ఎమోషన్ ని నీల్ యాడ్ చేసాడట. ఆ సినిమాలో అమ్మ సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో స్నేహం సెంటిమెంట్ పై నడుస్తుంది అని వినికిడి.
మరి ప్రభాస్ అంతలా నమ్మే ఆ స్నేహితుడు ఎవరో చూడాలి. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే రవి బాసృర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థే హోంబేలె ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
