ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన బిగ్ రిలీజ్ లలో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం “బ్రో ది అవతార్” కూడా ఒకటి. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ లో నటించారు.
మరి పవన్ ప్రెజెన్స్ తో అయితే గట్టి ఓపెనింగ్స్ నే ఈ చిత్రం అందుకోగా మొదటి వీకెండ్ వరకు ఓకే అనిపించింది. అయితే ఇక మొదట సోమవారం నుంచే భారీగా డ్రాప్ అయిపోయిన బ్రో వసూళ్లు మళ్ళీ పెద్దగా ఊపందుకోలేదు. దీనితో అనుకున్నట్టుగానే నష్టాలతోనే ఈ సినిమా ముగుస్తుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.
అయితే ఇక ఈ వారంలో కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేవు పైగా ఉన్న వాటిలో ఆడియెన్స్ కూడా వాటిపై అంత ఆసక్తి చూపించడం లేదు కాబట్టి ఇదే “బ్రో” చిత్రానికి లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ వారాంతం మూడు రోజుల్లోనే బ్రో కి వచ్చే ఎంతో కొంత ప్లస్ అవుతుంది అని చెప్పాలి.
దీనితో ఈ వీకెండ్ వసూళ్లే బ్రో కి కీలకం. ఇక మళ్ళీ సోమవారం వసూళ్లతో మరింత డ్రాప్ తప్పనిసరి అలాగే నెక్స్ట్ వీక్ కొత్త రిలీజ్ లతో బ్రో రన్ ఆగిపోయినట్టే సో ఈ రెండు రోజుల్లోనే బ్రో కి ఏమన్నా వసూళ్లు వస్తే రావాలి లేదా లైట్ తీసుకోవడమే..ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా థమన్ సంగీతం అందించాడు.