తారక రత్న.. రాజకీయ ఒత్తిడి వల్లనే.!

నందమూరి తారక రత్నకి గుండె పోటు ఎందుకు వచ్చింది.? మెదడు పని తీరులో ఎందుకు సమస్యలు తలెత్తాయి.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా రంగంలో సక్సెస్‌లు ఆశించిన మేర లేకపోయినా తారక రత్న ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొనేవాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలొచ్చినా, ఏనాడూ కుంగిపోలేదు.

కానీ, ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మొదలైందో, అప్పటినుంచే కొంత ఆందోళనగా కనిపించడం మొదలైందంటూ తారకరత్నకి అత్యంత సన్నిహితులైనవారు చర్చించుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపై తారక రత్న మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గుడివాడలో పోటీ చేయాలని తారకరత్న డిసైడ్ అయినా, చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదట.

టిక్కెట్టు ఖరారు చేస్తే తన పని తాను చేసుకుపోతానని తారకరత్న కోరినా, చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో, తారకరత్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడంటున్నారు. బాబాయ్ కూడా ఈ విషయంలో తారక రత్నకి సహకరించలేదట.