కాంతార సినిమా కోసం వెయ్యి దుస్తులను డిజైన్ చేసిన డిజైనర్.. ఇంతకీ డిజైనర్ ఎవరో తెలుసా?

కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిన కాంతార మూవీ విడుదలైన అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లను సాధిస్తూ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే.రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా 1890ల నాటి
ప్రజల జీవన విధానాన్ని, అప్పటి రాజరిక ప్రభుత్వానికి
ప్రజలకు మధ్య ఆధిపత్య పోరాటాన్ని అద్భుతంగా చిత్రీకరించి కర్ణాటక ఆదివాసీల పురాతన సాంప్రదాయ ప్రసిద్ధ జానపద కళ భూతకోల వృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అద్భుతాన్ని సృష్టించాడు దర్శకుడు రీషబ్ శెట్టి.

కాంతార మూవీలో నటీనటులు ధరించిన దుస్తులు ఆధ్యాత్మిక కాలానికి అనుగుణంగా తయారు చేయడంలో సక్సెస్ సాధించాలని చెప్పవచ్చు. అయితే కాంతారా సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించిన ప్రగతి శెట్టి మరెవరో కాదు రిషబ్ భార్య
ఈమె తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. కాంతార స్క్రిప్ట్ రెడీ అయ్యాక, కథ చెప్పగానే కాస్ట్యూమ్‌పై పరిశోధన మొదలుపెట్టానని ప్రగతి శెట్టి తెలిపారు. ఆ సమయంలో తాను గర్భవతి అయినప్పటికీ కర్ణాటకలోని మారుమూల గ్రామమైన గుత్తినమనే గ్రామ నాయకుల కుటుంబ సభ్యులను కలిసి వారి ఆచార వ్యవహారాలు వారి పాత ఫోటోలను సేకరించడంలో చాలా కష్టపడ్డామని ఈ సందర్భంగా తెలియజేశారు.

కాంతార సినిమా ఆధ్యాత్మికమైన దేవుని కథతో సాగుతుంది కాబట్టి కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.మేము మొత్తం ముగ్గురం కాస్ట్యూమ్‌లో పనిచేశామన్నారు ప్రగతి శెట్టి. రాకీ, కిరణ్‌ తనకు సహాయకులుగా ఉన్నారన్నారు. క్వీన్ అబ్బక్క మ్యూజియంలను కూడా సందర్శించి ఆనాటి వస్త్ర అలంకరణ విషయాలను తెలుసుకున్నాం
ప్రగతి శెట్టి దాదాపు 1000 డ్రెస్‌లను డిజైన్ చేసి ఉండవచ్చని అన్నారు. ప్రధాన పాత్ర యొక్క దుస్తులలో 10 మార్పులు ఉన్నాయి. ఇది మొత్తం 350. రిషబ్ పాత్రలో దాదాపు 20 సెట్లు ఉన్నాయి. సప్తమి గౌడ రెండు సార్లు వేర్వేరు బట్టలు వేసుకుంది. కాబట్టి మొత్తం 1000 కంటే ఎక్కువ డిజైన్లు ఉన్న దుస్తులు ఈ సినిమాలో ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది.