కన్నడ సినీ పరిశ్రమలో విడుదలైన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కర్ణాటక రాష్ట్రంలో గుర్తింపు పొందిన పంజర్ల దేవుడి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో దేవుడికి విరుద్ధంగా కోర్టు మెట్లు ఎక్కినా వ్యక్తి అక్కడే రక్తం కక్కుకొని చనిపోయిన సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా కర్ణాటకలో అచ్చం ఇలా సీన్ రిపీట్ అయ్యింది. దేవుడి నేమోత్సవం వేడుకలు అడ్డుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కిస్తే తీసుకువచ్చిన పూజారి గుడిలో అడుగుపెడుతుండగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
వివరాలలోకి వెళితే…కర్ణాటకలోని ఉడిపిలో పదుబిద్రి అనే గ్రామంలో పదుహిట్లు జరందయ దేవస్థానం ఉంది. ఇక ప్రతి ఏటా.. ఇక్కడ నేమోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.ఒక కమిటీ జరందయ దేవస్థాన నిర్వహణ చూసుకుంటుంది. దీనికి ప్రకాశ్ శెట్టి అనే వ్యక్తి ఛైర్మన్‌గా ఉండేవాడు. అయితే పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రకాశ్ శెట్టి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇంతకాలం పదవిలో ఉండి ఇప్పుడు పదవి కోల్పోవడంతో ప్రకాష్ శెట్టి ఎలా అయినా తిరిగి పదవి దక్కించుకోవాలనుకున్నాడు. దీంతో ఐదుగురు వ్యక్తులతో కలిసి కొత్త కమిటీ ఏర్పాటు చేసి తనకు నచ్చిన వ్యక్తిని ప్రధాన పూజారిగా నియమించాడు.
ఇదిలా ఉండగా ప్రతి ఏటా నిర్వహించే నేమోత్సవాన్ని.. ఈ సారి జనవరి 7న నిర్వహించి.. కోలం వేయాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రకాష్ శెట్టి తో అతడు నియమించిన కొత్త పూజారి నిరసన వ్యక్తం చేస్తూ, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు కొత్తగా నియమించిన పూజారి ఆలయంలోకి అడుగు పెట్టబోతుండగా ఒకసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేవుడికి విరుద్ధంగా నేమోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి కోర్టు స్టే తీసుకురావడంతో పూజారి ఇలా మరణించాడని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో పూజారి మరణంతో జనవరి 7న జరగాల్సిన నేమోత్సవ వేడుకలను దేవస్థాన కమిటీ వాయిదా వేసింది. కానీ ప్రకాశ్ శెట్టి, అతడి అనుచరులు మాత్రం.. వేడుకలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆలయ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు.