Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రిషబ్ శెట్టి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈయన పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా కాంతార. గతంలో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. కన్నడలో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. అలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. ఇకపోతే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2 లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో పని చేసే ముగ్గురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే చనిపోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఇకపోతే తాజాగా కూడా మరొక ప్రమాదం జరిగింది. తృటిలో పెను ప్రమాదం నుంచి మూవీ టీం. ప్రస్తుతం దీని చిత్రీకరణ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. శనివారం సాయంత్రం 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది.
ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషబ్ శెట్టి కూడా అందులో ఉన్నారు. వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతో పాటు పలు సాంకేతిక పరికరాలు నీటి పాలయ్యాయి. అలా పెద్ద ప్రమాదం నుంచి తాజాగా మూవీ మేకర్స్ తప్పించుకున్నారు. అయితే గత ఏడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బ్యాంకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. అదే నెలలో రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో కన్నుమూశాడు. నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) సైతం గుండెపోటుతో మృతి చెందినట్లు శనివారం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా మరో ప్రమాదం జరగడంతో కాంతార సినిమా వెనుక ఏదైనా నడుస్తుందా? ఈ సినిమాను ఆపేయడం మంచిదేమో లేదంటే ముందు ముందు ఇంకా ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి ఏమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుసగా ప్రమాదాలు జరగడం వెనుక ఏదైనా కారణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.