బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ మారిందని చెప్పవచ్చు. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలో నటించడానికి ఏమాత్రం ఇంటరెస్ట్ చూపించని పరభాష నటులు ఇప్పుడు తెలుగులో నటించడం కోసం పోటీలు పడుతున్నారు. ఇప్పటికే తమిళం నుంచి కార్తీ, ధనుష్ లాంటి వాళ్లు తెలుగు స్ట్రైట్ సినిమాలు చేశారు. మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన రిషబ్ శెట్టి తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేయబోతున్నాడు.
కాంతారా సినిమాతో నటుడిగా దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ప్రస్తుతం కాంతార టు సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తన తర్వాత సినిమాలను తెలుగులో చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే ప్రశాంత్ వర్మతో తన మొదటి తెలుగు సినిమాని ప్రకటించాడు. హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న జై హనుమాన్ లో హనుమంతుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు రిషబ్ శెట్టి తెలుగులో తన రెండవ సినిమా గురించి కూడా అనౌన్స్ చేశాడు. ఆకాశవాణి మూవీ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో హీరోగా రిషబ్ శెట్టి కమిట్ అయ్యాడంట. సితార సంస్థలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పిరియాడికల్ స్టోరీ తో తెరగెక్కుతున్న యాక్షన్ మూవీ అని తెలుస్తుంది.
కథలోని బలం కొత్తదనం నచ్చిన రిషబ్ శెట్టి ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ వారంలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందంట. ఇదే నిజమైతే తెలుగులోను రిషబ్ శెట్టి సాలిడ్ మార్కెట్ ఏర్పడటం పక్కా అంటున్నారు సినీ విమర్శకులు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేస్తున్నాడు.