డిజిటల్ సినిమా పైరసీని సమర్థవంతంగా అరికట్టేందుకు TFCC వారు TGCSB వారితో అవగాహన ఒప్పందం

TFCC : ఈ అవగాహన ఒప్పందం ద్వారా పైరసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌లు, IPTV స్ట్రీమ్స్ మరియు మొబైల్ అప్లికేషన్‌లలో జరుగుతున్న డిజిటల్ పైరసీపై రియల్-టైమ్ పర్యవేక్షణ, త్వరితగతిన పైరసీ కంటెంట్ తొలగింపు మరియు సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబడింది.

సినిమా విడుదలైన వెంటనే జరిగే పైరసీ వల్ల పరిశ్రమకు కలిగే భారీ నష్టాలను అరికట్టేందుకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మరియు సినిమా పరిశ్రమ మధ్య వేగవంతమైన సమాచారం పంచుకోవడం, సమర్థవంతమైన సమన్వయం ఈ MoU యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి, IPS, TGCSB డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, IPS, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ డి. సురేష్ బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె. అశోక్ కుమార్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ దిల్ రాజు, నిర్మాతలు శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శ్రీ వై. సురేందర్ రెడ్డి, శ్రీమతి సుప్రియ యార్లగడ్డ, యాంటీ వీడియో పైరసీ సెల్ చైర్మన్ శ్రీ రాజ్‌కుమార్ ఆకెళ్ళ, యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రోజెక్ట్ హెడ్ శ్రీ మణింద్ర బాబు మరియు యాంటీ వీడియో పైరసీ సెల్ టీం సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్.

నా అన్వేష్ నీచుడు || Cine Critic Dasari Vignan Fires On Naa Anveshana || Anasuya || Shivaji || TR