జీవితాలతో ఆడుకునే వాడిని “గురువు” అనొద్దు… పూనమ్‌ కౌంటర్?

గురుపౌర్ణమి సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన బండ్ల గణేష్… పవన్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ లో గురువు గురువు అంటూ గణేష్ పలుమార్లు ప్రస్థావించారు. దానికి కొనసాగింపుగా అన్నారో.. లేక, ఎప్పటినుంచో మనసులో ఉన్న ఆవేదనను చెప్పడానికి గురుపౌర్ణమిని ఒక అవకాశంగా మలుచుకున్నారో తెలియదు కానీ… “గురువు” పై పూనమ్‌ కౌర్ ఒక కీలకమైన వ్యాఖ్యలు ఆన్ లైన్ వేదికగా చేశారు!!

అవును… టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గానే ఉంటారనేది తెలిసిన విషయమే. టాలీవుడ్ లో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. గవర్నర్‌ తమిళిసై ముందే కంటతడి పెట్టార పూనమ్‌. ఆ సందర్భంగా తాను తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే తాజాగా గురుపౌర్ణమిని పురష్కరించుకుని పూనమ్‌ ఒక పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. ఈ పోస్ట్ లో… “మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు ‘గురువు’ కాదు, మీకు దారి చూపించేవారు ‘గురువు’ అవుతారు” అని రాసుకొచ్చింది!

దీంతో… ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారు అంటూ ఆన్ లైన్ లో ఒక చర్చ తెగ వైరల్ అవుతుంది.

కాగా… పూన‌మ్ కౌర్ ఇటీవల “ఉస్తాద్ భ‌గ‌సింగ్‌” ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అంతకంటే ముందు… తన పెళ్లి కలల్ని తుంచేశారని తనని కించపరిచారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన చుట్టూ ఎందరో రావణులు ఉన్నా.. తాను దేవత కాబట్టి క్షమించానని చెప్పిన సంగతి తెలిసిందే.