Poonam Kaur: కాపీ రైట్స్ అంటూ పూనమ్ సంచలన పోస్ట్… త్రివిక్రమ్ ను వదిలిపెట్టలేదుగా?

Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం పెద్ద ఎత్తున వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా పూనమ్ కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నటుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు మాత్రం సంచలనంగా ఉంటాయి . ఇక ఈమె జీవితాన్ని త్రివిక్రమ్ పూర్తిగా నాశనం చేశారు అంటూ ఆయన పై నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఇన్ని రోజుల పాటు పూనమ్ త్రివిక్రమ్ గురించి పోస్టులు చేసిన అతని పేరు ప్రస్తావించకుండా చేసేవారు కానీ ఇటీవల కాలంలో  త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పూనమ్ స్పందిస్తూ… ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ ఈమె ఆయన పై ప్రశంసలు కురిపించారు.

ఇలా ఒరిజినల్ కంటెంట్ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ కాపీ రైట్ సమస్యలు, పీఆర్ స్టంట్ లు ఉన్న దర్శకులకు వచ్చినంత గుర్తింపు మాత్రం క్రిష్ గారికి రాలేకపోయింది అంటూ ఈమె పోస్ట్ చేశారు. ఇక ఈమె చేసిన పోస్ట్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా డైరెక్టర్ త్రివిక్రమ్ టార్గెట్ చేశారని చెప్పాలి. అయితే ఒకానొక సమయంలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం కొన్ని సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోనూ హీరో చెల్లెలు పాత్రలలోనూ నటించారు. ఇక ఈమె సినిమాలకంటే కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎంతో ఫేమస్ అవుతూ వార్తల్లో నిలిచారు.