ప్రభాస్ “సలార్” ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్ట్రాంగ్ ఇన్ఫో.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సలార్”. కన్నడ “కేజీఎఫ్” సినిమాల ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే తన కేజీఎఫ్ రెండు సినిమాలు మించి పదింతలు ఏక్షన్ తో ఉండనున్నట్టుగా ప్రశాంత్ నీల్ నే కన్ఫర్మ్ చేసాడు.

దీనితో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా ఇప్పుడు షూట్ అనేక కీలక ప్రాంతాల్లో అయితే జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ పై అయ్యితే ఓ స్ట్రాంగ్ ఇన్ఫో ఇప్పుడు తెలుస్తుంది. ఈ మాసివ్ ఎపిసోడ్ ని అయితే ప్రశాంత్ నీల్ ది బెస్ట్ గా డిజైన్ చేసాడట.

అంతే కాకుండా ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ పై ఎలివేషన్స్ గాని ఏక్షన్ గాని ప్రభాస్ కెరీర్ లోనే ఆల్ టైం ది బెస్ట్ గా నిలిచేలా వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. అంటే ఇక ఈ లెక్కన ఈ సన్నివేశం ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

కాగా ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబేలె ఫిల్మ్స్ వారు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రం ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కానున్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇక జూన్ లో అయితే మొదటగా ప్రభాస్ ఆదిపురుష్ రాబోతున్న సంగతి తెలిసిందే.