బన్నీ సినిమానే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటి?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్గా గా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టి సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొనీ దాదాపు 100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నట్లు సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు గట్టిగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప2 షూటింగ్లో బన్నీ, రష్మిక మందాన బిజీగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

అసలు విషయానికొస్తే పుష్ప మూవీ తో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన ఇప్పటికే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ బాలీవుడ్లో పలు విజయవంతమైన సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పుష్ప సినిమాకు సుకుమార్ మొదట కొత్త హీరోయిన్ కోసం వెతుకుతూ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అయితే ఈ రోల్ కి చక్కగా అనిపిస్తుందని బోనీ కపూర్ కి స్క్రిప్ట్ చెప్పారట . అయితే కథ విన్న బోనీ కపూర్ మొదటి సినిమాతోనే డీ గ్లామరస్ లుక్ లో జాన్వీ కనిపిస్తే ఆమె ఇమేజ్ డామేజ్ అవుతుందని ఈ ప్రాజెక్టు జాన్వి చేయదని సుకుమార్ ముఖాన్ని చెప్పేసాడట బోనీ కపూర్.

దాంతో దర్శకుడు సుకుమార్ రష్మికను కలిసి పుష్ప సినిమా స్క్రిప్ట్ వివరించగా విన్న వెంటనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోవడంతో రష్మికను ఫైనల్ చేశాడట సుకుమార్. పుష్ప సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో అద్భుత విజయం సాధించడంతో హీరోయిన్ గా రష్మికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి పలు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయని చెప్పొచ్చు. పుష్ప సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్న జాన్వి కపూర్ ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృధా చేస్తోందని దీనంతటికీ కారణం ఆమె తండ్రి బోనీ కపూర్ అంటూ విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.