Jhanvi Kapoor: ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ బాగా క్రేజ్ ని ఏర్పరచుకుంది. అలా అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే మొదట్లో ఈమె బాలీవుడ్ సినిమాలలో నటించినప్పటికీ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీబిజీ అవ్వాలని ఇక్కడ కూడా రాణించాలని ప్రయత్నిస్తోంది జాన్వి కపూర్.
ఇప్పటికీ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో తంగం పాత్రలో జాన్వి కపూర్ ఆకట్టుకుంది. సినిమాలో అమ్మడి గ్లామర్ కి తెలుగు ఆడియన్స్ పడిపోయారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు జాన్వీ దేవర 2 చేయాల్సి ఉంది. అలాగే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో జాన్వీ కపూర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ దేవర సినిమాతో జాన్వీ కపూర్ కి పెద్దగా గుర్తింపు దక్కింది ఏమీ లేదు.
ఆ సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ షోకి మాత్రమే అన్నట్టుగా చూపించారు. కానీ పెద్ది విషయంలో అలాంటి తప్పు జరగకూడదని ఫిక్స్ అయ్యిందట జాన్వీ. అందుకే అమ్మడు ఈ పాత్రని ఎంపిక చేసుకుంది. ఇదిలా ఉంటే సౌత్ సినిమాల మీద ఫోకస్ తో అక్కడ బాలీవుడ్ లో అవకాశాలు మిస్ అవుతున్నాయని భావిస్తున్న జాన్వి కపూర్ ఇక మీదట అక్కడే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఎంత చేసినా సౌత్ లో గ్లామర్ కన్నా యాక్టింగ్ తోనే ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి పాత్రలు పడితేనే కానీ జాన్వికి ఇక్కడ సూపర్ స్టార్ డం వచ్చే అవకాశం ఉండదు. అందుకే సౌత్ సినిమాలు అడపాదడపా చేసినా తనకు అనుకువగా ఉండే హిందీ సినిమాలే చేస్తే బెటర్ అని భావిస్తుందట జాన్వీ కపూర్. ప్రస్తుతం అమ్మడు పెద్ది సినిమాతో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి పరం సుందరి కాగా మరొకటి సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తుంది జాన్వి కపూర్.