RC 16: బర్త్డే స్పెషల్…RC 16 నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్… బుచ్చి బాబు పోస్ట్ వైరల్!

RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం వరుస షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.

రామ్ చరణ్ ఇటీవల నటించిన గేమ్ చేంజర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో చరణ్ ఈ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ సినిమా ఢిల్లీలో షూటింగ్ పనులను జరుపుకుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ రెండో సినిమాని రామ్ చరణ్ సరసన నటించే అవకాశం అందుకున్నారు. ఇకపోతే నేడు ఈమె పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ పోస్టర్ లో జాన్వీ కపూర్ చంకలో గొర్రె పిల్లను పట్టుకొని మరో చేతిలో గడ్డిపోచ పట్టుకొని ఎంతో క్యూట్ గా నడిచి వస్తూ ఉన్నటువంటి ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని తెరపై చూడటం కోసం వేచి ఉండలేకపోతున్నాను అంటూ ఈయన ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.