పుష్ప 3 స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్ …. ఫైనల్ చేసేసిన దేవి శ్రీ ప్రసాద్?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు భాగాలలో స్పెషల్ సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పాలి. పార్ట్ వన్ లో ఉ అంటావా మామ అంటూ సమంత ఓ ఊపు ఊపేసింది. అదేవిధంగా పుష్ప 2 లో కిస్సిక్ అంటూ శ్రీ లీల కూడా అద్భుతమైన డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రెండు పాటలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే పార్ట్ 3 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టమవుతుంది అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పుష్ప 3’లో ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కిస్సికి పాటలు ఎవరు నటించిన వారు అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని ముందే ఊహించాము.

జాన్వీ కపూర్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆమెలో శ్రీదేవి గారిలో ఉన్న గ్రేస్ ఉంది. అందుకే తనని పుష్ప 3 స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ ఎంపిక చేసేటప్పుడు పాట మీద ఆధారపడి, డ్యాన్స్ సైల్ కూడా చాలా కీలకమని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. సమంత, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇలా టాప్ హీరోయిన్లందరూ ఐటెం సాంగ్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. మరి ఈయన అనుకున్న విధంగానే పుష్ప త్రీ స్పెషల్ సాంగ్ లో మనం జాన్వీ కపూర్ ను చూడబోతున్నామని స్పష్టమవుతుంది.