Jhanvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి నటి జాన్వీ కపూర్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈమె వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా వరుస సినిమాలతో నటిగా ఎంతో బిజీగా ఉన్నా జాన్వీ కపూర్ షూటింగ్లో ఎప్పుడు విరామం దొరికిన వెంటనే తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా తన తల్లి పుట్టిన రోజు అలాగే తనకు వీలైన ప్రతిసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే ఇటీవల కరణ్ జోహార్ కార్యక్రమంలో భాగంగా ఈమె తిరుపతి గురించి పలు విషయాలు వెల్లడించారు. తాను పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమై ముగ్గురు పిల్లల్ని కని తిరుపతిలోనే సెటిల్ అవుతానని తెలిపారు తనుకు నిత్యం గోవిందా గోవిందా అని తలుచుకోవడం ఇష్టమని, ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేయాలని ఈమె తెలిపారు.
తిరుపతి నా తల్లికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అందుకే నేను నా పెళ్లినీ కూడా తిరుపతిలోనే జరుపుకుంటాను అంటూ ఈమె తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా బయటపెట్టారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా జాన్వీ కపూర్ పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆమె నటుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరి పెళ్లి జరుగనుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈమె తన ప్రియుడుతో కలిసి తిరుమల ఆలయాన్ని కూడా పలు సందర్భాలలో దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే.