Shiva Puja: శ్రావణ మాసంలో దీపం ఇలా వెలిగిస్తే.. శివుడు ప్రసన్నుడు అవుతాడంట..!

శ్రావణ మాసం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో భోళా శంకరుడిని పూజించడం వల్ల అన్ని అపశకునాలు తొలగిపోతాయని, దైవ అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఈసారి శ్రావణ మాసం జూలై 25 నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు పండితులు. ఆవు నెయ్యితో బిల్వపత్రం చెట్టు కింద దీపం వెలిగించి.. భక్తి శ్రద్ధలతో శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే.. శివుడు ప్రసన్నుడు అవుతాడని పండితులు చెబుతున్నారు.

ప్రతీ రోజు దీపం: శ్రావణం మొదటి రోజే కాకుండా.. ఈ మాసంలో ప్రతి రోజూ ప్రదోష సమయంలో శివాలయంలోని, బిల్వవృక్షం కింద దీపం వెలిగించడం శుభ ప్రదమని చెబుతున్నారు. దీని వల్ల కుటుంబంలో ఎలాంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయని, వ్యాపారం వృద్ధి చెందుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.

శివుడికి ప్రీతికరం: శ్రావణ మాసంలో బిల్వ పత్రంతో శివలింగానికి అభిషేకం చేయడం, రుద్రాక్ష మాలను ధరించడం, మహామృత్యుంజయ జపం చేయడం ఇవన్నీ అత్యంత ఉత్తమమైనవని.. మనసారా భక్తి చేసేవారికి శివుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఈ మాసంలో అనుసరించే చిన్న చిన్న నియమాలు కుటుంబానికి ఆనందాన్ని, సమృద్ధిని తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు. కనుక శ్రావణ మాసంలో వీలైనంతవరకు ప్రతి రోజు శివాలయ దర్శనం చేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, బిల్వపత్రం సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం.

హిందువులు శ్రావణానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కాబట్టి ఈ మాసాన్ని ఆచరణలో నిలిపి, మహాదేవుని ఆశీస్సులు పొందాలని పెద్దలు సూచిస్తున్నారు. శ్రద్ధగా పాటిస్తే శివుని దయ లభిస్తుందని పండితులు చెబుతున్నారు.