ఇప్పుడు ఆల్ మోస్ట్ మూవీ లవర్స్ అంతా కూడా రీమేక్ సినిమాలు పెద్దగా చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఎంత గట్టి కంటెంట్ ఉన్నప్పటికీ ఆడియెన్స్ మాత్రం అంత ఆసక్తి కనబరచకపోవడంతో చాలా తక్కువే బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అలా మన తెలుగు నుంచి హిట్ అయ్యి హిందీలో రీమేక్ అయిన సినిమానే “షెహ్ జాదా”.
టాలీవుడ్ మాసివ్ హిట్ అల వైకుంఠపురములో సినిమాని హిందీలో తెరకెక్కించిన సినిమానే ఇది. దీనితో ఈ సినిమాపై కూడా మొదటి నుంచి మంచి బజ్ అయితే స్టార్ట్ అయ్యింది కానీ ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతున్నప్పటికీ హిందీ జనం మాత్రం ఈ సినిమాకి షాకిచ్చేలా కనిపిస్తున్నారు.
ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో సినిమాకి బుకింగ్స్ ఓపెన్ చేయగా దీనికి చాలా పూర్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయట. ఇంకా దీనికన్నా అదే రోజు వస్తున్న హాలీవుడ్ సినిమా “యాంట్ మెన్ 3” సినిమా చూసేందుకే వారు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనితో షెహ్ జాదా కన్నా హిందీలో హాలీవుడ్ సినిమాకే ఎక్కువ మార్జిన్ తో అయితే బుకింగ్స్ కనిపిస్తున్నాయ్.
దీనితో ఈ రీమేక్ పై కూడా అక్కడి ఆడియెన్స్ అంతగా ఆసక్తి కనబరచట్లేదు అనే చెప్పొచ్చు. కాగా ఆల్రెడీ తెలుగు వెర్షన్ ని హిందీలో చాలా మంది చూసేసారు. ఎందుకంటే అల్లు అర్జున్ కి హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. దీనితో ఒరిజినల్ వెర్షన్ కోసం చాలా మందికి తెలుసు. దీనితో కార్తీక్ ఆర్యన్ సినిమా కోసం అంత ఆసక్తి కనబర్చట్లేదు. మరి రిలీజ్ డేట్ నాటికి అయితే ఏమన్నా పుంజుకుంటుందో లేదో చూడాలి.
‘ANT MAN 3’, ‘SHEHZADA’ ADVANCE BOOKING STATUS… Tickets sold for *Day 1*… Update: Tue, 10.30 am…#PVR#AntMan3: 24,860#Shehzada: 1,845#INOX#AntMan3: 12,000#Shehzada: 1,000#Cinepolis#AntMan3: 7,047#Shehzada: 638
Total…
⭐️ #AntMan3: 43,907
⭐️ #Shehzada: 3,483 pic.twitter.com/lcp7KfWady— taran adarsh (@taran_adarsh) February 14, 2023