క్లారిటీ : “సర్కారు వారి పాట” ఫ్రీ స్ట్రీమింగ్ ఎప్పుడు నుంచో తెలుసా..!

Box Office Report Sarkaru Vaari Paata :

స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నదియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల మహేష్ బాబుతో ఫస్ట్ టైం తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఒక బిగ్ హిట్ గా నిలిచింది.
భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఆల్ మోస్ట్ కంప్లీట్ రన్ కి వచ్చేసింది. అయితే ఈ సమయంలోనే స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. అయితే ఈ స్ట్రీమింగ్ రెంట్ 199 రూపాయలు పే చేసి చూడాల్సిందిగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
కానీ ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ పై క్లారిటీ బయటకి వచ్చేసింది. దీని ప్రకారం అయితే ఈ సినిమా ఇదే జూన్ నెల 23 నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్రీ గా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుందట. దీనితో ఇప్పుడు ఈ క్లారిటీ వైరల్ అవుతుంది. రీసెంట్ గానే ఈ సినిమాలో మరో సాంగ్ మురారి వా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఫ్రీ స్ట్రీమింగ్ కోసం చూస్తున్న వారు అయితే అప్పటి వరకు ఆగాల్సిందే. లేదా ఇప్పుడు డబ్బులు పెట్టి చూడాలి.