టాలీవుడ్‌లో సమంత స్టార్డం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్‌లో సమంత బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసి టోటల్ సౌత్ మొత్తానికి క్వీన్‌గా మారింది. సౌతిండియన్ స్టార్‌గా సమంత పాపులార్టీ ఓ రేంజ్‌లో పెరుగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్‌లో సమంత చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఓ వైపు అర్బన్ ఫార్మింగ్ నేర్చుకుంటూనే ఆరోగ్యకరమైన ఫుడ్‌ను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకుంది.
ఇక ఇవే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాషన్ డిజైనర్ బ్రాండ్‌లను ఉత్పత్తి చేయాలన్న కోరికను నెరవేర్చుకుంది. చిన్నతనంలో మంచి డ్రెస్సులు వేసుకునే స్తోమత కూడా తమకు లేదని, ఇండస్ట్రీ రాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే దాన్ని అంటూ సమంత తన గతం గురించి చెప్పుకొచ్చింది. తక్కువ ధరలోనే మంచి డిజైనర్ దుస్తులను అందించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, అందుకే ఇన్నాళ్లకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సాకీ వరల్డ్ ఫ్యాషన్ డిజైనర్ బ్రాండ్ దుస్తులను లాంచ్ చేస్తున్నానని తెలిపింది.
అంతేకాకుండా ఈ సాకీ డిజైనర్ దుస్తులను సెలెబ్రిటీలందరికీ గిఫ్ట్‌గా పంపింది. రకుల్, కాజల్, ఉపాసన ఇలా ప్రతీ ఒక్కరికీ శాంపిల్స్‌ను పంపించింది. ఈ క్రమంలో తాజాగా పండుగ సీజన్ మొదలైన సందర్బంగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సమంతో తలనిండా మల్లెపూలు పెట్టుకుంది. సాకీ వరల్డ్ గురించి చెబుతూ.. మీరంతా కలిసి హాయిగా నవ్వుకునేందుకు ప్రేమలో పడేందుకు సరైన సమయమిదే. మీ స్టైల్లో మీరు ఈ ఏడాదిని ఈ పండుగను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోండంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత ఇలా సాకీ వరల్డ్‌ను బాగానే ఫేమస్ అయ్యేలా చేస్తోంది.