Sai pallavi: ఇక సహించేది లేదు… వారిపై చర్యలు తప్పవు.. మొదటిసారి ఫైర్ అయిన సాయి పల్లవి!

Sai pallavi: ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చి తన నటనతో డాన్స్ తో అందరిని ఫిదా చేశారు నటి సాయి పల్లవి. ఇలా ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలానటిగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు..

ఒకప్పుడు సౌత్ సినిమాలనే ఆచితూచి ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఓవెలుగు వెలిగిన సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈమె నటించిన అమరన్ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్యతో కలిసే నటించిన తండేల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సమయంలో ఈమె పూర్తిగా శాకాహారిగా మారిపోయారట. నాన్ వెజ్ తినకుండా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారని అదేవిధంగా ఎక్కడికి వెళ్లినా తన బృందాన్ని కూడా తీసుకువెళ్తున్నారని తెలుస్తోంది.

ఇలా సాయి పల్లవి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న తరుణంలో ఈమె మొదటిసారి వార్తల స్పందించారు. గతంలో ఈమె ప్రమేయం లేకుండా తన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఆ వార్తలపై పెద్ద ఎత్తున వివాదాలు జరగడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి స్పందిస్తూ ఇప్పటివరకు నా ప్రమేయం లేకుండా నా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ఎంతో పేరుగాంచిన మీడియాలో అలాగే వెబ్సైట్లో కూడా నా గురించి వార్తలు వచ్చాయి.

ఇలా వచ్చిన వార్తలపై తాను మౌనంగా ఉండటానికి ప్రయత్నించాను అయితే ఇకపై ఇలాంటి వార్తలను అసలు సహించేది లేదు తన ప్రమేయం లేకుండా అసత్యపు వార్తలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈమె హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.