Home Entertainment సౌత్ ఇండియాలో ఈ ఫీట్ హీరో ధనుష్ వల్ల మాత్రమే అయ్యింది

సౌత్ ఇండియాలో ఈ ఫీట్ హీరో ధనుష్ వల్ల మాత్రమే అయ్యింది

ధనుష్ నటించిన ‘3’ మూవీ లో కొలవెరి డీ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. అప్పటివరకు సౌత్ ఇండియాలోనే కాదు మొత్తం ఇండియాలోనే అంత వైరల్ అయిన పాత మరొకటి లేనే లేదు. మరలా అదే హీరో ధనుష్ – సాయిపల్లవి జంటగా 2018 లో నటించిన ‘మారి 2’ సినిమా కమర్షియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఆడియోకి అటు వీడియోకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటని ధనుష్ మరియ ఢీ ఆలపించారు. దీనికి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ లో ధనుష్ – సాయి పల్లవి ఎనర్జిటిక్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అనేక రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ తాజాగా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సాంగ్ గా రికార్డు కెక్కింది. 2019 జనవరి 2న యూట్యూబ్ లో విడుదల చేసిన ‘రౌడీ బేబీ’ పాట 1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ అరుదైన రికార్డు సృష్టించిన సందర్భంగా హీరో ధనుష్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. ”కొలవెరిడీ సాంగ్ 9వ వార్షికోత్సవం రోజు ‘రౌడీ బేబీ’ 1 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 1 బిలియన్ వీక్షణలను చేరుకున్న మొట్టమొదటి దక్షిణ భారత సాంగ్ ఇదే అవడం మేము గౌరవంగా భావిస్తున్నాం. మా టీమ్ మొత్తం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది” అని ధనుష్ ట్వీట్ చేశాడు. ధనుష్ పాడిన ‘కొలవెరిడీ’ సాంగ్ కూడా అనేక రికార్డ్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News