పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్ లేడి కమెడియన్… అతని పరిస్థితి ఏంటి..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఒకప్పుడు జబర్దస్త్ లో కేవలం మగవారు మాత్రమే కామెడీ చేసేవారు. కానీ ప్రస్తుతం జబర్దస్త్ లో చాలామంది ఆడవారు కూడా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన లేడీ కమెడియన్లలో రీతు చౌదరి కూడా ఒకరు.మొదట స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రీతు చౌదరి గోరింటాకు సీరియల్ లో నటించే అవకాశాన్ని తగ్గించుకుంది. ఈ సీరియల్ ద్వారా రీతు చౌదరికి మంచి గుర్తింపు రావటంతో వరుస సీరియల్స్ లో ఆఫర్లు వచ్చాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు ఇంటిగుట్టు అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇలా బుల్లితెర నటిగా మంచి గుర్తింపు పొంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రీతు చౌదరి జబర్దస్త్ లో కూడా సందడి చేస్తోంది. జబర్దస్త్ లో ఆది టీమ్ లో ఎక్కువ స్కిట్లు చేసింది. రీతు చౌదరి మీద ఆది వేసే పంచులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇలా జబర్దస్త్ లో పాపులర్ అయిన రీతు ఆది టీమ్ లో ఉన్న పరదేశి తో లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. వీరిద్దరూ కలిసి ప్రేమికులుగా చాలా స్కిట్లు చేశారు. సుధీర్, రష్మి అంత కాకపోయినా కూడా లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరూ కూడ బాగా ఫేమస్ అయ్యారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. టీవీ సీరియల్స్ , జబర్దస్త్ స్కిట్ లతో బిజీగా ఉన్నప్పటికీ రీతు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో గోల్డ్ ఫోటోషూట్స్ తో ఈ అమ్మడు చెమటలు పట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల రచ్చతో తన ఫాలోయర్స్ ని పెంచుకుంది. తాజాగా రీతు చౌదరి తనకి కాబోయే భర్త ని పరిచయం చేసింది. కొంతకాలంగా శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్న రీతు అతనిని వివాహం చేసుకోబోతున్నట్లు అందుకు సంబంధించిన ఫోటో కూడ సోషల్ మీడియాలో షేర్ చేసి పోస్ట్ చేసింది. తమ బంధం కంటే ఏది బెటర్ కాదని క్యాప్షన్ కూడా ఇచ్చింది ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి పరదేశి పరిస్థితి ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.