టీజర్ టాక్ : “వ్యూహం” తో అతడిపై సింపతీ యాంగిల్.!

తెలుగు సినిమా అలాగే రాజకీయాలు కూడా ఎప్పుడు నుంచో రెండూ వేరు కాదు ఒకటే అని తెలిసిందే. మరి ఇక ఇపుడు అయితే మరీనూ.. తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ పొలిటికల్ గా ఓ పార్టీ కి ఓ రాజకీయ నాయకుడికి అయితే సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పాడు.

మరి అలా గతంలో ఎన్నికల ముందు ఓ సినిమా ఇప్పుడు ఎన్నికల ముందు ఓ సినిమాతో వస్తున్నాడు. కాగా ఈసారి తాను తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “వ్యూహం”. అయితే ఈ చిత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై అలాగే గత 2009 లో జగన్ తండ్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో ఈ సినిమా తీసినట్టుగా సినిమా టీజర్ ఇప్పుడు చూస్తే అర్ధం అవుతుంది.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ ని వర్మ డిజైన్ చేయడం విశేషం. ఒక్క జగన్ పైనే కాకుండా అప్పుడు చిరంజీవి ఎస్ వై ఎస్ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అతడి దగ్గరకి ఎవరెవరు వచ్చారు? చంద్రబాబు పాత్ర ఇవన్నీ చాలా నాచురల్ తారాగణంతో అయితే వర్మ చూపించాడు.

అయితే ఇందులో జగన్ రోల్ పై బాగా సింపతీ యాంగిల్ ట్రై చేసినట్టుగా ఈ టీజర్ చూస్తే అనిపిస్తుంది. మరి ఈ సినిమా డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ తారాగణం పర్ఫెక్ట్ గా సెట్ కాగా ఈ టీజర్ ఆసక్తిగానే ఉంది కానీ న్యూట్రల్ గా అయితే లేదు. మరి సరిగ్గా ఎన్నికల ముందు ఏమన్నా దింపుతారో చూడాలి. 
'వ్యూహం' మూవీ టీజర్ | RAMGOPAL VARMA'S 'VYOOHAM' MOVIE TEASER | RGV |