‎Ram Gopal Varma: కాంతార 1 గురించి అలాంటి పోస్ట్ చేసిన ఆర్జీవీ.. అసలు అతను యాక్టరా, డైరెక్టరా అంట

‎Ram Gopal Varma: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమా కాంతార. గతంలో విడుదల అయిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. మొదట కన్నడలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.

‎ఈ మూవీ ఇటీవల అక్టోబర్ 2 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. అలాగే జయరాం, గుల్షన్ దేవయ్య వంటి యాక్టర్స్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది కాంతార మూవీ. విడుదల అయిన మొదటిరోజు ఏకంగా రూ.89 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు పిలుస్తోంది.



‎ ఇక ఈ సినిమాకు కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా స్టార్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్టీఆర్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు.. తాజాగా కాంతార సినిమా చూసిన ఆయన సోషల్ మీడియాలో వేదికగా ట్వీట్ చేశారు. కాంతార సినిమా ఒక అద్భుతం. దేశంలోని ప్రతీ నిర్మాత రిషబ్ శెట్టి, అతడి టీమ్‌ ని చూసి సిగ్గు పడాలి. సినిమా లోని కంటెంట్‌ వారి కష్టమే ఈ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా చేసింది. సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్‌ ని తప్పకుండా అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనేది తేల్చుకోలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.