యూఎస్, కేరళలో  విజయ్ “లియో” కి రికార్డు బిజినెస్.!

ఇప్పుడు కోలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న అతి కొద్ది చిత్రాల్లో క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న మాసివ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం “లియో”. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా ఆల్రెడీ షూటింగ్ కూడా సూపర్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది.

అయితే ఈ చిత్రానికి ఊహించని లెవెల్లో కోలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు బిజినెస్ అవుతున్నట్టుగా ఇది వరకే టాక్ ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా లియో యూఎస్ లో డీల్ పై క్రేజీ టాక్ బయటకి వచ్చింది. అయితే ఈ సినిమాకి కోలీవుడ్ హిస్టరీ లో ఏ సినిమాకి కూడా రాని బిగ్గెస్ట్ డీల్ యూఎస్ లో లాక్ అయ్యిందట.

ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్ల తో యూఎస్ లో పార్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వారు సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు సమాచారం. కాగా ఇది కోలీవుడ్ సినిమా దగ్గర అన్ని పాన్ ఇండియా సినిమాలలో ఆల్ టైం హైయెస్ట్ కాగా సౌత్ నుంచి అయితే ఆల్ టైం టాప్ 3 అన్నట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ చిత్రానికి కేరళ లో కూడా రికార్డు డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ సినిమాకి 16 కోట్ల డీల్ రాగ ఇది తమిళ్ సినిమాల్లో రికార్డు మొత్తం లో అత్యధికం అట. దీనితో అయితే విజయ్ లియో పై ఉన్న అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.