డబ్బు వ్యామోహంతో బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్న రష్మిక!

1664709181_rashmika

రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్ద గుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఇక తాజాగా ఈమె నటించిన వారసుడు మిషన్ మజ్ను సినిమాలో విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇక రష్మిక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎలాంటి గుర్తింపు పొందిందో అదే స్థాయిలో వివాదాలను ఎదుర్కొనే వార్తల్లో నిలుస్తున్నారు.

ఇలా వరుస వివాదాలతో ఈమె పెద్ద ఎత్తున నేటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే రష్మిక కూడా తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక ఒక్కో సినిమాకు సుమారు నాలుగు నుంచి 6 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె ఈ డబ్బు పై వ్యామోహంతో బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నారని తెలియడంతో అభిమానులు కూడా రష్మిక ఏంటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన రష్మికకు నటించే అవకాశం వచ్చిందట కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రష్మికకు అవకాశం రావడంతో ఈమె ఈ సినిమాలో నటించడానికి ఏకంగా ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ షాక్ అయ్యారట. ఇలా రష్మిక అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతోనే ఈమెను నిర్మాతలు పక్కన పెట్టారని వార్తలు రావడంతో అభిమానులు ఈ విషయంలో కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ పక్కన నటించిన అవకాశం వస్తే చాలని ఎంతో మంది ఎదురు చూస్తుండగా రష్మిక మాత్రం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.