సినిమా ఆఫర్స్ కోసం దేనికైనా సిద్ధం అంటున్న రష్మీ

ప్రస్తుతం తెలుగు లో ఉన్న టాప్ యాంకర్స్ లో రష్మి గౌతమ్ ఒకరు. మొదట్లో ‘హోలీ’, ‘కరెంట్’ లాంటి సినిమాల్లో నటించిన రష్మీకి తగిన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై ఫోకస్ షిఫ్ట్ చేసింది. మధ్యలో ‘అంతం’, ‘అంతకుమించి’, ‘గుంటూరు టాకీస్’ లాంటి సినిమాల్లో నటించినా అంత సక్సెస్ రాలేదు.

ఇప్పుడు టీవీ షోస్ తో బిజీ గా ఉన్న రష్మీ ‘కాస్టింగ్ కౌచ్’ మీద కొన్ని కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపించే అంశం కాస్టింగ్ కౌచ్. చాలా మంది నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులం అని చెబుతూ ఉంటారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ…..అవకాశం ఇస్తానంటే వెళ్ళడం అనేది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతే కాదు….. ఇలాంటి అవకాశానికి తాను కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టను అని దాన్ని గౌరవిస్తాను అని సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్ బాగుంటుంది అనిపిస్తే అలా వెళ్ళడం లో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది.