Rashmi: హాస్పిటల్ బెడ్ పై జబర్దస్త్ యాంకర్…. ఆ పని చేయలేకపోతున్నానంటూ ఎమోషనల్?

Rashmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రష్మి ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉన్నప్పటికీ రష్మీ మాట తీరుతో ఎంతోమందిని ఆకట్టుకుని ఇలా క్రమక్రమంగా తెలుగును స్పష్టంగా పలుకుతూ తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి అలాగే ఇతర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు యాంకర్ గా బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ సర్జరీకి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు అసలు రష్మీకి ఏమైంది సర్జరీ చేయించుకోవడం ఏంటి అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈమెకు భుజం నొప్పి ఉన్న నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నానని తెలిపారు అయితే సర్జరీ తర్వాత నేను తిరిగి డాన్స్ చేయగలుగుతాను అందుకోసం అని సెట్ అయ్యాయి అంటూ తన సర్జరీ గురించి తెలియజేశారు.

ఈ విధంగా రష్మీ సర్జరీ చేయించుకోబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఈమె తొందరగా కోలుకోవాలని తిరిగి తనకెంతో ఇష్టమైన డాన్స్ చేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రష్మీ జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఎవరైనా జంతువులకు హాని చేస్తే మాత్రం వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఈ విషయం గురించే వివాదాలలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే.