జబర్దస్త్ యాంకర్ గా ఎంత మంచి పేరు సంపాదించుకున్న రష్మీ జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా కమెడియన్లు యాంకర్లపై సెటైర్లు వేయడం వారి గురించి బాడీ షేమింగ్ చేయడం వంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రష్మీ గుట్టు మొత్తం రాకింగ్ రాకేష్ బయటపెట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాకింగ్ రాకేష్ దొంగ స్వామి గెటప్ వేశారు. అయితే ఈ స్కిట్ లో పటాస్ ప్రవీణ్ రష్మీ జాతకం చెప్పమని అడిగారు.దీంతో రాకింగ్ రాకేష్ ఆమె జాతకం చెబుతూ అందరూ డబ్బులు లేక గుండెలు బాదుకుంటూ ఉంటే రశ్మి మాత్రం గున్నా గున్నా మామిడి అంటూ గుండెలు బాదుకుంటూ డబ్బు సంపాదిస్తుంది అంటూ తన గురించి తెలియజేశారు. ఇలా రష్మీ డబ్బు సంపాదన గురించి రాకింగ్ రాకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే రాకింగ్ రాకేష్ ఇలాంటి కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే రష్మీ ఎన్నో సినిమాలలో నటించిన రాణి గుర్తింపు గున్నా గున్నా మామిడి పాటకు స్టెప్పులు వేయడంతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ రాకింగ్ రాకేష్ ఇలాంటి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన రష్మి సంపాదన గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.