వైరల్ : వింటేజ్ మెగాస్టార్ ని దింపేసిన చరణ్..శంకర్ సినిమాలో కొత్త లుక్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అసలు మాస్ అంటే ఒక కొత్త నిర్వచనం తెచ్చిన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాల్సిందే. తనదైన డాన్స్ లు తర్వాత మాస్ హీరోగా మెగాస్టార్ ఒక శిఖరంలా ఎదిగారు.

అయితే చిరుకి వారసుడుగా వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఇప్పుడు చిరు స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా పాన్ ఇండియా లెవెల్లో సహా పాన్ వరల్డ్ స్థాయిలో తన క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అయ్యింది. నెక్స్ట్ విజనరీ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి గాను ఇప్పుడు రామ్ చరణ్ సిద్ధం చేసిన లుక్ కనుక చూస్తే మెగా ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి. బిగ్ బాస్ టైం లో మెగాస్టార్ చేసిన లాంగ్ హెయిర్ గడ్డం లుక్ ని దింపేసి మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని ఇప్పుడు రామ్ చరణ్ గుర్తు చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోని చరణ్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రిలీజ్ చెయ్యగా ఇప్పుడు ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తూ వైరల్ గా మారిపోయింది. మొత్తానికి అయితే ఈ దెబ్బతో సినిమాపై మళ్ళీ మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ సినిమాలో అయితే రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో చూడాల్సిందే.