చిరంజీవి సినిమాలో రామ్ చరణ్… సీక్రెట్ రివీల్ చేసిన సల్మాన్ ఖాన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇటీవల ఆచార్య సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. “లూసిఫర్” అనే మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార కూడా ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేసాయి. ఇక ఇటీవల ఈ సినిమా హిందీ వర్షన్ కి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబైలో ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, చిరంజీవి పాల్గొని సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. ఆచార్య సినిమాలో తండితో కలిసి నటించిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అతిధి పాత్రలో కనిపించనున్నాడని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రేక్షకుల ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది.