పుష్ప 2 షూటింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడూ,ఎక్కడంటే?

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సంచలన చిత్రం పుష్ప. సంవత్సరం క్రితం విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీ ప్రేక్షకులను ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో పుష్ప సినిమా సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా అంచనాలకు మించి హిట్ అవటంతో పుష్ప 2 మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాని తెరకెక్కించాలని సుకుమార్ భారీ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక ప్రస్తుతం పుష్ప టు సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎంతో అద్భుతంగా ఎదురుచూసిన ప్రేక్షకులకు సుకుమార్ శుభవార్త చెప్పాడు. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి పుష్ప సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు.

అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ని అల్లు కుటుంబం కొత్తగా నిర్మించిన స్టూడియోలో ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గండిపేట సమీపంలో అల్లు కుటుంబం 10 ఎకరాలలో ఒక స్టూడియోని నిర్మించింది. ఇటీవల ఈ స్టూడియో నిర్మాణ పనులు మొత్తం పూర్తయ్యాయి. అక్టోబర్ ఒకటవ తేదీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియోని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అదే రోజు ఆ స్టూడియోలో పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.