Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. పది రోజులు పాటు ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్న కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.
ఇక ఈ సినిమా 10 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించింది.రెండవ వారాంతంలో పుష్ప 2 హిందీ బెల్ట్‌లో 100 కోట్ల పైగా వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. రెండో ఆదివారం వసూళ్లు భారీగా 54 కోట్ల గ్రాస్, సినిమా మొత్తం హిందీ కలెక్షన్ ఇప్పుడు 561.5 కోట్ల గ్రాస్ కి చేరుకుంది.
ఇలా ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ వీక్ ఓకే రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది అలాంటి అద్భుతమైన ఘనత కేవలం బన్ని సినిమాకు మాత్రమే సాధ్యమైందని ఈ విషయంలో అల్లు అర్జున్ మరో రికార్డ్ సృష్టించారని చెప్పాలి. ఇక ఈ వారాంతరం రెండో శనివారం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతూ సినిమాని చూసి ఆనందించారు.
ఇక రష్మిక అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ కావడంతో అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత పెరిగిపోయింది. ఇక రష్మిక నటన కూడా ఎంతో అద్భుతమని చెప్పాలి.ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సపోర్టింగ్ క్యాస్ట్‌లో జగపతి బాబు, జగదీష్, సునీల్, అనసూయ మరియు రావు రమేష్ ఉన్నారు.