“ప్రాజెక్ట్ కే”.. క్రేజీగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో అయితే టాలీవుడ్ యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేసిన వరల్డ్ క్లాస్ సినిమా “ప్రాజెక్ట్ కే” ఒకటి. మన భారతదేశ ఇతిహాసానికి సంబంధించి ఒక యూనిక్ పాయింట్ తో మేకర్స్ ఈ సినిమాని అత్యంత గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ ఫ్యాన్స్ గాని సినిమా లవర్స్ గాని చాలా ఎగ్జైటెడ్ గా ఈ సినిమా పట్ల ఉన్నారు.

కాగా ఈ సినిమా పై ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ కి మరింత హైప్ రాగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ని కేజ్రీగా మార్చింది. మేకర్స్ అప్పుడు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ తాను పెట్టి ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా పెట్టాడు.

“నీ కలలు నిజం అవుతున్నప్పుడు వాటిని ఆస్వాదించు” అంటూ మెన్షన్ చేసాడు. దీనితో ఇంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి వరల్డ్ లెవెల్ ప్రోజేసీ మ్యూజిక్ వేరే లెవెల్లో అందిస్తున్నాడని చెప్పకనే చెప్తున్నాడు. కబాలి టీజర్ కి ఇచ్చిన మ్యూజిక్ ఎవరూ మర్చిపోలేరు.

ఆ టీజర్ అంతలా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది అంటే అందుకు మొదటి కారణం రజిని మాస్ ప్రెజెన్స్ కాగా సగం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేపింది అని చెప్పడంలో సందేహం లేదు. బహుశా తాను కూడా తన టాలెంట్ కి తగ్గట్టుగా వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ కి చేయాలి అనుకున్న డ్రీం ప్రాజెక్ట్ కే తో సాకారం అవుతున్నట్టుగా తాను భావిస్తున్నాడు కావచ్చు. దీనితో ఈ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.