వైరల్ : పవన్ విషయంలో కీలక డెసిషన్ తీసుకున్న నిర్మాతలు.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో ఆల్రెడీ మూడు సినిమాలు పవన్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా నిన్ననే ఈ సినిమాల నిర్మాతలు అందరు కూడా పవన్ తన పొలిటికల్ టూర్ కోసం సిద్ధం చేసుకున్న వాహనం “వారాహి” తో అయితే పూజలు జరిపిన ప్రాంతంలో వారు కూడా కనిపించారు.

పైగా ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా జనసేన పార్టీలో జాయిన్ కావడంతో సినీ వర్గాల్లో కొత్త ఒరవడిగా మారింది. కాగా ఇప్పుడు పవన్ పొలిటికల్ టూర్ స్టార్ట్ చేస్తే ,మరి షూటింగ్స్ ఎలా అని అంతా అనుకోగా పవన్ అయితే అందుకు మరో ప్లాన్ నిర్మాతలతో వేసినట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

నిన్న పవన్ నిర్మాతలు అందరు కలిసి ఇపుడు పవన్ ఎక్కడ ఎక్కువ సమయం ఏపీలో ఉంటే అక్కడికి దగ్గర ఏరియాల్లో అయితే తమ షూటింగ్ లు సెట్ వర్క్స్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యామని తెలియజేసారు. ఇలా ఓ హీరో కోసం ఇంతలా కేర్ తీసుకొని వర్క్ చేస్తుండడం బహుశా మొదటి సారే అని చెప్పాలి.

పవన్ పొలిటికల్ మీటింగ్స్ కూడా ఇబ్బంది లేకుండా పవన్ ఉదయం రాజకీయాల్లో ఉంటే సాయంత్రం సినిమా షూటింగ్ లో హాజరు అయ్యేలా ప్లాన్ లు చేస్తున్నట్టుగా నిర్మాతలు అయితే తెలియజేసారు. దీనితో పవన్ విషయంలో నిర్మాతలు తీసుకున్న డెసిషన్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.