‎OG: పవన్ మూవీకీ A సర్టిఫికెట్.. రజినీకాంత్ సినిమాకి పట్టిన గతే ఓజీకీ కూడా పట్టనుందా?

OG: రజనీకాంత్ ఇటీవల హీరోగా నటించిన మూవీ కూలీ. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి పర్వాలేదు అనిపించుకుంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. మరి అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ రాలేదు. అయితే అందుకు గల కారణం సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ రావడమే అని అంటున్నారు. కూలికి A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలా మల్టీప్లెక్స్ లలో 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలని రానివ్వలేదు. దీంతో చాలా ఫ్యామిలీలు సినిమాకు వచ్చి వెనుతిరిగాయి.

‎కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వద్దకు కూడా అసలు రాలేదు. ఇక పిల్లల్లో రజినీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమాకు వెల్దామని అనుకున్నా A సర్టిఫికెట్ వల్ల కొన్ని థియేటర్స్ రానివ్వలేదు. దీంతో ఈ ఎఫెక్ట్ కూలీ సినిమాల కలెక్షన్స్ పై పడింది. దీనిపై కూలీ నిర్మాత హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు కూడా జరుగుతుందేమో అని భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. అసలే పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలిలో పిల్లల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు కూడా జనసేనకు, పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఉంటున్నారు.

‎వాళ్లంతా థియేటర్స్ కి వెళ్తే రానిస్తారా? ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ లో రానిచ్చినా మల్టీప్లెక్స్ లో కష్టమే. అసలే దసరా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీలు అంతా కలిసి సినిమాకు వెళ్లాలి అనుకుంటాయి. ఇలాంటి టైంలో A సర్టిఫికెట్ అని పిల్లల్ని రానివ్వకపోతే ఫ్యామిలీలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇదే గునుక జరిగితే ఇది కచ్చితంగా OG కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇందులో వైలెన్స్, రక్తపాతం ఎక్కువగా ఉందనే సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిందట. మరి నెటిజన్స్ అభిప్రాయపడుతున్నట్టు కూలి సినిమాకు పట్టిన గతే ఈ సినిమాకు పడుతుందా అలాంటి కలెక్షన్లే వస్తాయా లేదా అన్నది చూడాలి మరి.