ప్రభాస్ ట్రిపుల్ ధమాకా.! సాధ్యమేనా.?

‘బాహుబలి’ నుంచి ‘రాధేశ్యామ్’ వరకూ చాలా చాలా ‘అలసత్వం’ కనిపించింది.. ఇందులో ‘బాహుబలి’కి ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే, ఓ పది పాతిక సినిమాలు చేస్తే వచ్చే పాపులారిటీ ‘బాహుబలి’తో వచ్చేసింది ప్రభాస్‌కి. సో, అది ఆలస్యమవడం వల్ల ప్రభాస్‌కి వచ్చిన నష్టమే లేదు.. అంతా లాభమే.

కానీ, ‘సాహో’ విషయంలో, ‘రాధేశ్యామ్’ విషయంలో చాలా పెద్ద నష్టమే జరిగింది. అందుకే, ఇకపై ఆలస్యం చేయకూడదని ప్రభాస్ అనుకుంటున్నాడట. నిజమేనా.? ఏమోగానీ, ప్రస్తుతానికైతే బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు సెట్స్ మీద వున్నాయ్. మొత్తంగా నాలుగు సినిమాలు.!

వీటిల్లో ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ విడుదలవడం దాదాపు ఖాయమేనన్న చర్చ జరుగుతోంది. దాదాపుగా రిలీజ్ డేట్స్ కూడా వచ్చేసినట్లే. మరి, ‘మారుతి’ దర్శకత్వంలో సినిమా.? అది కూడానట.! నమ్మొచ్చా.? నమ్మి తీరాల్సిందేనేమో.!

అదే జరిగితే, మొత్తంగా మూడు సినిమాలు 2023లో వచ్చేస్తాయన్నమాట. వస్తే మంచిదే. అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.? అన్నట్టు, ‘ప్రాజెక్ట్-కె’ సినిమాని కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.