Sonu sood: సేవ చేయడానికి పవర్ అవసరం లేదు…పొలిటికల్ ఎంట్రీ గురించీ క్లారిటీ ఇచ్చిన సోను సూద్..!

Sonu sood: ఫిల్మ్ ఇండస్ట్రీలో సోనుసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోను సూద్ తెలుగు, తమిళ,హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. సోను సూద్ ఎక్కువగా రీల్ లైఫ్ లో విలన్ గా మాత్రమే అందరికీ తెలుసు కానీ.. సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా సోను సూద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.ఆ తర్వాత అతడు, చంద్రముఖి, అరుంధతి , దూకుడు, కందిరీగ వంటి పలు సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించి అందరి మన్ననలు పొందాడు.

సోను సూద్ చేసే సేవా కార్యక్రమాల ద్వారా అతని పేరు దేశమంతటా తెలిసిపోయింది. ముఖ్యంగా కరోనా విజృంభించిన సమయంలోపొట్టకూటి కోసం వలస వెళ్లిన వందలాది మంది వలస కూలీల ను తన సొంత డబ్బులతో గమ్యస్థానాలకు చేర్చాడు. సోనుసూద్ చేసే మంచి పనులకు సాధారణ ప్రజలే కాకుండా పలువురు ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు. అయితే కొందరు విమర్శకులు మాత్రం రాజకీయాలలో ఎంట్రీ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలలో ఏ మాత్రం నిజం లేదని సోను సూద్ వెల్లడించాడు.

అయితే ఇటీవల సోనూసూద్ సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో కూడా తన సేవా కార్యక్రమాలకు, తన చెల్లెలు రాజకీయాల్లోకి రావడానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలియజేశారు. అయితే సోషల్ మీడియాలో సోనుసూద్ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై మరొకసారి స్పందించాడు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, సేవ చేయటానికి పవర్ అవసరం లేదు .. దేవుడు దయ ఉంటే చాలు అని స్పష్టం చేశారు. తాను చేసే సేవా కార్యక్రమాలు మరింత విసృతం చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.