వైరల్ : కోటాని ఏకేస్తున్న పవన్ ఫ్యాన్స్.!

టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అయితే ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే కోటా శ్రీనివాస్ రావు ఇప్పటికే ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ ఈ వయసులో తాను ఇస్తున్న ఇంటర్వూస్ లో అలాగే కొన్నియు ఈవెంట్ లలో చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా వైరల్ గా మారుతున్నాయి.

కాగా లేటెస్ట్ గా అయితే తన కో స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ హీరో తనకి రేవుజుకి 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నాడు అని అలాగే ఇతనిలా అప్పట్లో ఎన్టీఆర్, ఏ ఎన్నార్ కానీ శోభన్ బాబు గాని ఎవరు ఇలా చెప్పుకోలేదని పవన్ పై ఫైర్ అయ్యారు.

దీనితో ఈ కామెంట్స్ విన్న పవన్ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం ఊరుకోవడం లేదు. ఇంత వయసు వచ్చినా కూడా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కానీ పరిస్థితి. అసలు పవన్ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో ఈయనకి తెలుసా అని సదరు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాల్లో పవన్ పై ప్యాకేజీ అంటూ ముద్ర వేస్తె దానిపై పవన్ స్పందించాడు. మరి పవన్ పై అన్ని కామెంట్స్ చేసినప్పుడు మరి కోటా ఎందుకు వాటిని ఖండించలేదు అని ఏకేస్తున్నారు. వాటిపై మాట్లాడ్డం తెలీదు కానీ ముందు మైక్ పెడితే మాత్రం ఏది పడితే అది మాట్లాడ్డం కరెక్ట్ కాదని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోటా పై ఫైర్ అవుతున్నారు.